విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ కార్యలయంలో రైల్వే సదుపాయాలు, అభివృద్ధిపై శుక్రవారం రైల్వే శాఖ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఏలూరు పార్లమెంట్ పరిధిలో రైల్వే స్టేషన్లకు సంబంధించి కావలసిన సదుపాయాలను, అలాగే పలు సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు.