సైబర్ నేరాల పట్ల ఏలూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడుతూ. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచించారు. అలాగే వ్యక్తిగత ఫోటోలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేయొద్దన్నారు. అలా చేయడం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని హెచ్చరించారు.