3వ రోజు ఆందోళన

1246చూసినవారు
3వ రోజు ఆందోళన
జి. కొత్తపల్లి గ్రామంలో విజయ డైరీ కార్మికులను అమూల్ డైరీలో కొనసాగించాలని కోరుతూ జరుగుతున్న ఉద్యమం గురువారం 3వ రోజుకు చేరుకుంది. ధర్నా శిబిరాన్ని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. ఎన్. వి. డి. ప్రసాద్ సందర్శించి పూర్తి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మన ఆస్తులను గుజరాత్ అమూల్ కు 30 సంవత్సరాలు లీజ్ కు ఇవ్వడం అంటే అమ్మడమేనన్నారు. గత 15 ఏళ్ళ నుండి పనిచేస్తున్న కార్మికులను అమూల్ లో కొనసాగించాలని చేస్తున్న ఉద్యమం న్యాయమైందన్నారు.

తక్షణమే అధికారులు స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులతో ఉద్యమాలను ఆపలేరు అన్నారు. అనంతరం డి. డి. ఉమదేవిని ప్రసాద్ నాయకత్యంలో కలిశారు. రాష్ట్ర అధికారి ఎం. డి. అహమాథ్ బాబుకు లేఖ రాస్తానని చెప్పారు. సీఐటీయూ నేత సాల్మన్ రాజు మాట్లాడుతూ కార్మికులు కు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె. వెంకట్రావు, యూనియన్ నేతలు రవీంద్ర, జయరాజు, మహిళ కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్