ఆలయానికి కరోనా సెకండ్ వేవ్ ప్రభావం!

9874చూసినవారు
ఆలయానికి కరోనా సెకండ్ వేవ్ ప్రభావం!
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పడింది. సోమవారం నుంచి వకుళ మాత అన్నదాన భవనంలో అన్నప్రసాదం నిలిపివేస్తూ దేవస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నప్రసాదం స్థానంలో భక్తులకు ఫుడ్ ప్యాకెట్స్ వితరణ చేయనున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపద్యంలో ఆరోగ్య శాఖ మరియు దేవాదాయశాఖ ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. గత సంవత్సరం కరోనా కారణంగా వకుళ మాత అన్నదాన భవనంలో భక్తులు కూర్చుని అన్నదానం చేసే విధానాన్ని నిలిపివేశారు.

అనంతరం కొన్ని నెలల తర్వాత స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఫుడ్ ప్యాకెట్స్ వితరణ చేశారు. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 4 నుంచి మరల వకుళ మాత అన్నదాన భవనంలో భక్తులు కూర్చుని అన్నదానం స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రోజు రోజుకి కేసులు పెరుగుతున్న కారణంగా ఆరోగ్య, దేవాదాయ శాఖ అధికారులు భక్తులు కూర్చుని అన్నదానం చేసే ఏర్పాట్లను నిలిపివేయాలని దేవస్థానానికి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థానంలో భక్తులకు ఫుడ్ ప్యాకెట్స్ వితరణ చేయాలని ఆదేశాలిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్