పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామ పంచాయతీ పరిధిలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీధులలో వస్తున్న పాదచారులు, వాహనదారులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. వీధుల్లో ప్రయాణం చేయడానికి రైతులు, చిన్నపిల్లలు, మహిళలు భయపడుతున్నారు. ఈ కుక్కల దాడి వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.