ద్వారకా తిరుమల మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన ఎస్ఐ వెంకట సురేష్ అన్నారు. ఏలూరు నుంచి బదిలీపై వచ్చిన ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం బాధ్యతలు చేపట్టారు. మండలంలో పేకాట కోడి పందాలు వంటి జూదాలపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు.