ద్వారకాతిరుమల మండలంలో కర్ఫ్యూ నిబంధనలు పోలీస్ అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరల తిరిగి ఉదయం 6 గంటల వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలను ప్రజలు పాటిస్తున్నారు. 12 గంటల నుంచి మండల పరిధిలోని గ్రామాలలో షాపుల యజమానులు స్వచ్ఛందంగా మూసి వేస్తున్నారు. ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సి ఆర్ పి సి నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తూ 144 సెక్షన్ ఉల్లంఘించి షాపులు నడుపుతున్న దుకాణాలపై కేసులు నమోదు చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ లు రమేష్ , జై రాజ్ గ్రామాలలో పర్యటిస్తూ అనవసరంగా రోడ్లపై తిరిగే వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. నిబంధనలు మీరిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.