మొగల్తూరు స్థానిక మండల సమాఖ్య కార్యాలయం నందు మంగళవారం మండల సమాఖ్య ఓబీ సభ్యులు ఎన్నిక నిర్వహించారు. మండల సమాఖ్య అధ్యక్షురాలుగా వనమాల కనకదుర్గ, ఉపాధ్యక్షురాలుగా కుక్కల నాగమణి, కార్యదర్శిగా జక్కంశెట్టి నాగమణి, సహాయ కార్యదర్శిగా బొడ్డు ఆదిలక్ష్మి, కోశాధికారిగా కత్తుల చంద్రవతి లను డ్వాక్రా గ్రామ సమాఖ్య ల సభ్యులు ఏకీగ్రీవంగా ఎన్నుకున్నారు.