మొగల్తూరు మండలం వార్తప్ప గ్రామంలో వెలసిన శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని నైవేద్యములు సమర్పించారు. ఆలయ నిర్మాతలు నాగిడి శ్రీరాములు, లీలావతి దంపతులు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసారు.