నరసాపురంలో రోజు రోజుకు చెత్త సమస్య ఎక్కువైపోతున్న దృష్ట్యా 14వ వార్డులో డంపింగ్ యార్డ్ నందు లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ మిషన్ ను గురువారం మున్సిపల్ కమిషనర్ ఎం అంజయ్య పరివేక్షించారు. అనంతరం అదే వార్డులోని త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కమిషనర్ ను ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో కొప్పాడ కృష్ణవేణి కుమార్, డి. ఈ ప్రవీణ్ చంద్ర, ఏ. ఈ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.