నరసాపురం: ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

67చూసినవారు
ఎమ్మెల్సీ ఎన్నికలు, నీటి సంఘాల ఎంపికకు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం గణపవరం మండలం గణపవరం బాపిరాజా జెడ్పి బాలుర హైస్కూల్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ స్టేషన్ కు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికకు ఒక రూము, నీటి సంఘాల ఎంపికకు ఆరు రూములను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్