నరసాపురం పట్టణంలోని పొన్నపల్లిలో ఆదివారం పేకాట స్థావరంపై దాడులు చేసినట్లు నరసాపురం పట్టణ ఎస్ఐ సీహెచ్. జయలక్ష్మి తెలిపారు. ఈదాడిలో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 3200 నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.