నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలో పాత ముద్దాయిలు ఎనిమిది మందిపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు నూజివీడు ఎక్సైజ్ సీఐ మస్తానయ్య తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ అక్రమ మద్యం తయారు చేసినా, అమ్మకాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అంతేకాక ప్రభుత్వ పథకాలు కూడా నిలుపుదల చేయడం జరుగుతుందన్నారు.