ఉచిత ఇసుక పాలసీని అమలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం సిపిఎం ప్రజాపోరులో భాగంగా పాలకొల్లు తహసిల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం తహసిల్దార్ దుర్గ కిషోర్ కు సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.