పోడూరులో మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వద్ద స్థానిక తెల్లరేషన్ కార్డుదారులకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జడ్పిటిసి గుంటూరి పెద్దిరాజు ఎంపీపీ సబ్బితి సుమంగళి, వైస్ ఎంపీపీ ఇందుకూరి సీతారామరాజులు మంగళవారం పంపిణీ చేశారు. వైస్ ఎంపీపీ ఇందుకూరి సీతారామరాజు మాట్లాడుతూ పేదవారికి మెరుగైన వైద్యసేవలను అందించడానికి, ఆరోగ్యశ్రీ పేదవర్గాలకి మరింత చేరువ చెయ్యటానికి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో కొత్త అంశాలను కలపడం జరిగిందన్నారు.