పాలకొల్లులో భారీ వర్షం... చెరువుల్లా మారిన రహదారులు

73చూసినవారు
ప. గో. జిల్లా పాలకొల్లు పట్టణంలో శనివారం తెల్లవారుజాము నుండి కుంభవృష్టి కురుస్తుంది. రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. పట్టణంలోని పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వ్యాపారాలు మూతపడ్డాయి. విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్