శ్రావణమాసంలో టిడ్కో గృహప్రవేశాలు లబ్ధిదారులకు ఎమ్మెల్యే హామీ

582చూసినవారు
రాబోయే శ్రావణమాసంలో మిగిలిన అర్హులైన టిడ్కో లబ్ధిదారులందరికీ, టిడిపి ఆధ్వర్యంలో గృహప్రవేశాలు చేయిస్తానని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. పాలకొల్లు పట్టణం 30వ వార్డులో బుధవారం సాయంత్రం నిర్వహించిన జయహో బిసి కార్యక్రమంలో ఎంఎల్ఏ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గానికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, తన గెలుపు నియోజకవర్గ అభివృద్ధికి అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్