విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం రూ. 11, 440 కోట్ల రివైవల్లో ప్యాకేజీని ప్రకటించడంతో పాలకొల్లు నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకులు జక్కంపూడి కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ కు ఈ సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆంధ్ర అభివృద్ధి పట్ల ఎన్డీఏకి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శమని కొనియాడారు.