యలమంచిలి మండలంలోని నేరేడుమిల్లి, పెనుమర్రు, గుంపర్రు, కట్టుపాలెం, సిరగాలపల్లి గ్రామాల్లో రూ. 1కోటి 38 లక్షల ప్రభుత్వ నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం శంకుస్థాపన నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్మాణాలను ప్రజలే సంరక్షించుకోవాలి అని అన్నారు. గ్రామాల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు