పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని స్థానిక శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో మంగళవారం స్వామివారికి అర్చకులు రమణ గురుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మంగళ నీరాజనాన్ని నివేదించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కైంకర్యాలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.