పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఆదివారం వర్షం కురిసింది. ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై చినుకులు పడుతూనే ఉన్నాయి. గత 4 రోజులుగా ఆకాశం మేఘావృతమై, వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని, పూర్తి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.