పాలకొల్లు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మహిళ గర్భం నుంచి 9 కిలోల కణితిని శస్త్రచికిత్స చేసి వైద్యులు తొలగించారు. అంతర్వేదికి చెందిన వరికుర్తి లక్ష్మీ తాను కొంతకాలంగా గల్ఫ్‌లో ఉన్నానని, అక్కడ కడుపు నొప్పి వచ్చేదని అలాగే భరించినట్టు తెలిపింది. పది రోజుల క్రితం అంతర్వేది రావడంతో ఆసుపత్రిలో చూపించుకోని వైద్యులు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న కణితి తొలగించగా బుధవారం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.