అత్తిలిలో మంగళవారం జరిగిన సీపీఐ తణుకు ఏరియా సమితి సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కొనాల భీమారావు అతిథిగా పాల్గొని మాట్లాడారు. శ్రీలంకలో కమ్యూనిస్టుల విజయం స్ఫూర్తితో సీపీఐ శ్రేణులు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా శక్తి వంచన లేకుండా శ్రమించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భీమారావు పిలుపునిచ్చారు. శ్రీలంకలో పాలకుల అవినీతి స్వార్థపూరిత పాలనతో ఆర్థిక సంక్షేమానికి గురైందన్నారు.