తణుకు రైల్వే అవుట్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన సంగాని సత్యవతి(74) ఇంటింటికీ తిరిగి రొయ్యలు విక్రయించుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో పైడిపర్రు నుంచి సజ్జాపురం వెళ్లేందుకు గౌతమి సాల్వెంట్స్ వద్ద రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.