తణుకు మండలంలోని సర్పంచులు, కార్యదర్శులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో భాగంగా మంగళవారం రెండో రోజు తణుకు మండలం మండపాక గ్రామంలో కొనసాగించారు. గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల వద్ద అవగాహన కల్పించారు. కేంద్రాల పనితీరు, షెడ్డు నిర్మాణం తదితర అంశాలపై వారికి అవగాహన కల్పించారు. తణుకు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.