ఆకివీడు మండలం కుప్పనపూడి, అజ్జమూరు గ్రామాలలో గురువారం గ్రామ రెవెన్యూ సదస్సు కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అర్జునుడు గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సును పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం వచ్చిన రెవెన్యూ అర్జీలపై క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.