మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఉండి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ నరసింహారాజు మంగళవారం పేర్కొన్నారు. కాళ్ల మండల కేంద్రమైనా బొండడా గ్రామంలో కట్టా వారి ఆంజనేయ స్వామి గుడి వెనకాల ఉన్న మైదానంలో 1269 గ్రూపులు 12728 మంది స్వయం సహాయక పొదుపు మహిళలకు వైయస్ఆర్ ఆసరా పథకం మూడో విడత కింద మంజూరైన రూ.16, 68, 47, 917/- చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదిరాజు సుబ్బరాజు పాల్గొన్నారు. మహిళలు, లబ్ధిదారులతో కలసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలభీషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో కాళ్ల మండల జడ్పిటిసి, ఎంపీపీ, త్రి కమిటీ సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు, కాళ్ల మండల కన్వీనర్, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, మహిళా కార్యకర్తలు, నాయకులు మరియు వైయస్సార్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.