గణపవరం మండలం సరిపల్లి గ్రామంలో పంచాయతీ ఆధ్వర్యంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం వందరోజుల కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం వచ్చినా వంద రోజులలో ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించారని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కరపత్రాలు అందజేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి దైవాల రామాంజనేయులు, ఉప సర్పంచ్ క్రొవ్విడి కృష్ణ సాయి, కూటమి నాయకులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.