నాటు సారా తయారు చేసి చుట్టు పక్కల గ్రామాలలో అమ్ముతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని 28 లీ. ల నాటు సారాను, 1600 రూ. ల నగదు సీజ్ చేసి కేసు నమోదు చేయడమైనది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాబడిన సమాచారం పై భీమడోలు సీఐ వెంకటేశ్వర రావు ఉత్తర్వుల మేరకు నాటు సారా అమ్మకం పై దాడి చేసి, కొడూరుపాడు కు చెందిన మరీదు లక్ష్మి నీ అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె వద్ద 10 లీ. ల నాటు సారా ను స్వాధీనం చేసకోవడమైనది. తనకు ఆ సారా ఆగడాల లంక గ్రామానికి చెందిన భలే వెంకన్న, భలే గంగయ్యలు అమ్మారని చెప్పింది. దానిపై కొల్లేరు లో సారా బట్టి ఉన్న ప్రదేశం కనుగొని మెరుపుడాడి చేసి, సారా కాస్తున్న భలే వెంకన్న మరియు భలే గంగయ్య లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి వెయ్యి రూ. ల నగదు, 18 లీ. ల సారా స్వాదీనం చేసుకొని, 300 లీ. బెల్లం ఊటను కూడా ధ్వంసం చేయడమైనది. సారా కాసి అమ్ముతున్న మారీదు లక్ష్మి, భలే వెంకన్న, భలే గంగయ్య లను అరెస్ట్ చేసి భీమడోలు కోర్ట్ లో హాజరు పరచగా నిందితులకు 15 రోజుల రిమాండ్ విధించారు.