దళిత గిరిజన పాత్రికేయుల న్యాయమైన సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలనీ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండేటి ఆనంద్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కలక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి మూర్తిని జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ సభ్యులు కలిసి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కొండేటి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజన పాత్రికేయులు అనేక ఆర్థికపరమైన ఇబ్బందులతో పాటు వృత్తిపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. దళిత గిరిజన పాత్రికేయులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైన రుణాలను మంజూరుచేసి వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి మూర్తి మాట్లాడుతూ జర్నలిస్టుల ఇచ్చిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు బాలాజీ, ప్రధాన కార్యదర్శి దాసరి సుభాకరరావు, కమిటీ సభ్యులు పి. వెంకటనారాయణ, జి. రవికుమార్, బి నరసింహరాజు, పాత్రికేయులు పాల్గొన్నారు.