మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో ఎర్రవెల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం ముగిసింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగినట్లు ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను సభలో ఎండగడతామని చెప్పారు. రేపటి నుంచి అసెంబ్లీకి కేసీఆర్ వస్తారో.. రారో.. మీరే చూస్తారని అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల చట్టబద్ధత, రెండు విడతల రైతు బంధు ఇవ్వాలని పట్టుబడతామన్నారు. కాగా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.