జంగారెడ్డిగూడెం: ఇద్దరి మధ్య ఘర్షణ కేసు నమోదు

56చూసినవారు
జంగారెడ్డిగూడెం: ఇద్దరి మధ్య ఘర్షణ కేసు నమోదు
జంగారెడ్డిగూడెం పట్టణంలోనే స్థానిక ఉప్పలమెట్టకు చెందిన కట్టా భోగేశ్వరరావుతో అదే ప్రాంతానికి చెందిన ముంగా దుర్గాప్రసాద్ అమర్యాదగా ప్రవర్తించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో దుర్గాప్రసాద్ రాయితో భోగేశ్వరరావును కొట్టడంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి. స్థానికులు అతడిని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై మంగయ్య బుధవారం వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్