నరసాపురం: ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలను ఉపేక్షించేది లేదు
జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థను కట్టుదిట్టంగా నిర్వహించాలని, ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని నరసాపురం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజా పంపిణీ వ్యవస్థపై సివిల్ సప్లైస్ అధికారులు, తహసీల్దార్లతో సమీక్షించారు. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను పేదవర్గాల అభ్యున్నతికి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు.