నరసాపురం మండలం కొప్పరు గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కె. వి. శ్రీనివాస్ నిర్వహిస్తున్న షాప్ నెంబర్ 89ని బుధవారం నర్సాపురం రెవెన్యూ డివిజన్ అధికారి దాసి రాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, పేదలకు అందవలసిన నిత్యవసర వస్తువులు సక్రమంగా అందుతున్నాయా అనే విషయంపై తనిఖీ చేసిన ఆర్డీవో దాసి రాజు, షాపులో అవసరమైన అన్ని సరుకులు సరైనంగా ఉన్నాయని తెలిపారు. ఈ తనిఖీల్లో సి ఎస్ డి టి , విఆర్వో వినోద్ పాల్గొన్నారు.