
సజ్జాపురం ఏవులమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే
తణుకు పట్టణంలోని సజ్జాపురం నందు శ్రీ ఏవుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది.