
తణుకు: కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుంది
తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమన్వయంతో అందరూ పనిచేయాలని సూచించారు. కష్టపడిన కార్యకర్తలు, నేతలకు తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.