Sep 09, 2024, 17:09 IST/
ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన పడవలు.. నిందితులకు 14 రోజుల రిమాండ్
Sep 09, 2024, 17:09 IST
ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీ కొట్టి ధ్వంసం చేసిన ఘటనలో అరెస్టు చేసిన ఇద్దరినీ పోలీసులు విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం పడవల యజమాని ఉషాద్రితోపాటు, మరో వ్యక్తి రామ్మోహన్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. ఈ నెల 1న ప్రకాశం బ్యారేజీలోని 67, 69, 70 గేట్ల కౌంటర్ వెయిట్లను వరదల కారణంగా 4 పడవలు ఢీ కొట్టిన సంగతి తెలిసిందే.