ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్ హీథర్ నైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి హీథర్ నైట్ తప్పుకుంది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. ‘ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్సీ పదవి నుంచి హీథర్ నైట్ వైదొలిగింది. తొమ్మిదేళ్ల పాటు కెప్టెన్ సేవలు అందించినందుకు థాంక్యూ నైట్’ అని బోర్డు పేర్కొంది.