యూపీలోని నోయిడాలో ఇద్దరు దుండగులు అందరూ చూస్తుండగానే చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఓ వ్యక్తి దుకాణం ముందు నిలబడి మోమోస్ తింటున్నాడు. ఈ క్రమంలో బైక్‌పై ఇద్దరు దుండగులు అక్కడికి వచ్చారు. నెమ్మదిగా అతడి దగ్గరకు వచ్చి మెడలో నుంచి చైన్ లాక్కొని పారిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.