AP: గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లలో గెలుపొందిన
వైసీపీ తాజా ఎన్నికల్లో 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఈ క్రమంలో జూన్ 24 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాల్గొంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. సమావేశాల తొలి రోజు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఒకవేళ జగన్ అసెంబ్లీకి వెళ్లకపోతే.. సమావేశాల అనంతరం స్పీకర్ ఛాంబర్‌లో ఆయన ప్రమాణం చేస్తారు.