వైసీపీ సభ్యులు వాస్తవాలు మాట్లాడాలి: లోకేష్

81చూసినవారు
వైసీపీ సభ్యులు వాస్తవాలు మాట్లాడాలి: లోకేష్
AP: గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా శాసనమండలిలో గందగోళం నెలకొంది. అధికార, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణీ విమర్శించారు. 4 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టుగా చెప్పించారన్నారు. ఆమె మాట్లాడుతుండగా మంత్రి లోకేష్ జోక్యం చేసుకుని వైసీపీ సభ్యులు వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. 4 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమని చెప్పామని.. కల్పించామని ఎక్కడా చెప్పలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్