నటి ప్రీతి జింటాపై కేరళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేశారు. ప్రీతి జింటా తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని, దానికి ఆమెకు బ్యాంకులో రూ.18 కోట్లు మాఫీ అయ్యాయని ఆరోపించారు. ఈ కారణంగా ఆ బ్యాంకును మూసేయడంతో డిపాజిటర్లు రోడ్డున పడ్డారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. తాను సోషల్ మీడియా ఖాతాలను సొంతంగానే నిర్వహించుకుంటానని, ఇలా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గు చేటని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.