ఉత్తరప్రదేశ్‌లోని బరౌలిలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో వింత ఘటన జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా పెళ్లి కొడుకు ఫుల్లుగా మద్యం తాగి పెళ్లి కూతురు ఇంటికి వచ్చాడు. పూల మాల మార్చుకునే క్రమంలో పెళ్లికూతురుకు బదులు స్నేహితుడి మెడలో పూలమాల వేశాడు. దీంతో షాక్‌కు గురైన పెళ్లికూతురు పెళ్లినే క్యాన్సిల్ చేసింది. ఈ ఘటనపై వరుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వారినే తప్పుబట్టారు.