AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లిలో టీడీపీ యువనేత రాకేష్ చౌదరి ఏనుగు దాడిలో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. రాకేష్ చౌదరి మృతితో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. నారావారిపల్లె, భీమవారం, కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాల్లో గజరాజుల జాడ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏనుగుల జాడ తెలియకపోవడంతో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.