కన్నుల పండుగగా రథోత్సవం

63చూసినవారు
కడప జిల్లా జమ్మలమడుగులో వెలసిన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాకార రథోత్సవం కన్నుల పండువగా సాగింది. బుధవారం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి అర్చకులు వేదమంత్రాలతో, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి సందర్బంగా ఉత్సవ మూర్తులను టేకు రథంపై ఏర్పాటు చేసి గర్భగుడి ప్రాకారంలో రథోత్సవం నిర్వహించారు. శ్రీవారి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని రథోత్సవాన్ని తిలకించారు.

సంబంధిత పోస్ట్