చెన్నూరు వద్ద పెన్నా నదిలో భారీగా నీటి ప్రవాహం

77చూసినవారు
చెన్నూరు వద్ద పెన్నా నదిలో భారీగా నీటి ప్రవాహం
శ్రీశైలానికి భారీగా వరద రావడంతో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి నంద్యాల సమీపంలో కుందూ నదిలోకి నీటిని మళ్లించడంతో కుందూ నది నుంచి వస్తున్న వరద నీరు పెన్నా నదిలోకి చేరుతున్నది. మంగళవారం చెన్నూరు వద్ద పెన్నా నదిలో 30 వేల క్యూసెక్కులు వరద నీరు ప్రవహిస్తూ సోమశిల జలాశయంలోకి పరుగులు పెడుతున్నది. పెన్నా నదిలోకి ఎవరు దిగకుండా చెన్నూరు మండల తహాసిల్దార్ వీఆర్వో, వీఆర్ఏ లకు ఆదేశాల జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్