వీధి కుక్కల దాడిలో గాయపడిన బాధితుడికి ఎమ్మెల్యే సాయం

62చూసినవారు
వీధి కుక్కల దాడిలో గాయపడిన బాధితుడికి ఎమ్మెల్యే సాయం
కమలాపురం పట్టణంలోని నాయిబ్రాహ్మణ వీధిలో ఈ నెల 16న కుక్కల దాడిలో నాగరాజు కుమారుడు తరుణ్ గాయపడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తరుణ్ పై వీధి కుక్క దాడి చేయడంతో పొట్ట, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి బుధవారం రూ. 10వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. కడప రిమ్స్ కు చికిత్స నిమిత్తం చిన్నపిల్లల వైద్య విభాగానికి బాలుడిని తరలించారు.

సంబంధిత పోస్ట్