వల్లూరు మండల పరిషత్తు కార్యాలయంలో మంగళవారం మండల ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నామమాత్రంగా జరిగింది. ప్రజల సమస్యలను ప్రస్తావించాల్సిన ప్రజాప్రతినిధులు అరకొరగా రావడం వచ్చిన వారిలో ఒకరిద్దరు మినహా మిగతా వారు సమస్యల ఊసే ఎత్తలేదు. ఇన్చార్జి ఈవోపీఆర్డీ శ్రీధర్, జడ్పీటీసీ వెంకటసుబ్బయ్య, వివిద శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.