ఖాజీపేటలో మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన సదస్సు

52చూసినవారు
ఖాజీపేటలో మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన సదస్సు
జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి మాదకద్రవ్యాల నిర్మూలన పక్షోత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 10వ రోజు ఖాజీపేట టీచర్స్ కాలనీ సమీపంలో ఉన్న సమీకృత బాలుర వసతి గృహంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిమ్స్ సైకాలజీ నిపుణుడు డాక్టర్ కంభం లక్ష్మీనారాయణ గారు, మాదకద్రవ్యాల వాడకం వల్ల యువత ఆలోచనా శక్తి, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్