వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించవద్దు: తులసిరెడ్డి

58చూసినవారు
యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రాంగణం నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కొందరు టీడీపీ నాయకులు తొలగించాలని వైస్ ఛాన్సలర్కు వినతిపత్రం అందించడం శోచనీయమని తులసిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ యోగివేమన విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడని, దాదాపు 16 ఏళ్ల నుంచి ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించబడి ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల ద్వారా విద్యా రంగానికి ఆయన చేసిన సేవలు అమోఘమన్నారు.

సంబంధిత పోస్ట్